స్వాతంత్రస్పూర్తితో పవన్ పోరాటం చేస్తాడా..?

Thursday, April 28th, 2016, 08:20:20 AM IST


చిన్నపిల్లల దగ్గరి నుంచి రేపో మాపో కాటికిపోయే వారు వరకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ముందుండి వారికి స్పూర్తిని ఇస్తూ నాయకులు నడిపిస్తుంటే.. యువకులు వారి బాటలోనే నడిచారు. మహాత్మా గాంధి దగ్గరి నుంచి భగత్ సింగ్ వరకు అందరు భారతదేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వారే. వారి కృషి కారణంగానే మనకు స్వాతంత్రం లభించింది. ఆ స్వాతంత్ర పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని ఎవరు ఎటువంటి పోరాటం మొదలు పెట్టిన తప్పకుండా విజయం సిద్దిస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకు ఉదాహరణ కెసిఆర్. తెలంగాణ కోసం 14 సంవత్సరాల పాటు అలుపెరుగని పోరాటం చేశారు. ఫలితం తెలంగాణ వచ్చింది.

ఇప్పుడు ఇదే స్పూర్తితో పవన్ రాజకీయాలపై పోరాటం చేయాలి. పవన్ ఆశయాలు చాలా గొప్పవి అనడంలో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. పవన్ భావాలు అభ్యుదయ భావాలే. అందరూ సమానమే అని నమ్మే వ్యక్తి. రాజకీయాలలో మార్పు రావాలి అని కోరుకుంటున్న ప్రజానాయకుడు. అయితే, పవన్ భావాలు, పవన్ ఆశయాలు ప్రజలలోకి ఎలా వెళ్తాయి. ప్రజలు వాటిని ఎలా అర్ధం చేసుకుంటారు అనే విషయంపైనే పవన్ రాజకీయ జీవితం ఆధారపడి ఉన్నది. పవన్ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా పోరాటం చేస్తే.. పవన్ కళ్యాణ్ తప్పకుండా విజయం సాధిస్తారు. పవన్ రాజకీయ జీవితం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే కదా.