‘పవన్ కళ్యాణ్’ వేసిన ప్లాన్ సూపర్ హిట్ అయింది

Friday, June 24th, 2016, 09:23:16 AM IST


రాష్ట్రంలో ఒకవైపు రాజధాని సమస్య, మరో వైపు కాపు రిజర్వేషన్ల గొడవ. ఈ రెండు అంశాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణాన ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుందో అని అందరూ కంగారుగా చూశారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల అంశంలో ఏ నేత ఎలా మాట్లాడతాడు, ఎవరికి సపోర్ట్ చేస్తాడు, ఎలా ఇరుక్కుంటాడు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరూ అనుకున్నట్టే చిరు, జగన్, దాసరి వంటి వారు ఒకరి వర్గం తరపునే మాట్లాడి మరొక వర్గం దృష్టిలో కాస్త చులకనయ్యారు.

కానీ ఒకేఒక్క వ్యక్తి మాత్రం ఈ కుల రాజకీయం జోలికి వెళ్ళలేదు. ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజధాని సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో యుద్దానికి దిగదానికి సిద్దమయ్యాడు గాని కాపు సమస్యపై మాత్రం మాట్లాడలేదు. కాపు వర్గానికి చెందినవాడే అయినప్పటికీ వారికి సపోర్ట్ చేయలేదు. అలాగని ఇతరులకి మద్దతివ్వలేదు. మౌనం వహించి ఈ కుల రాజకీయాలకు తాను దూరం అని చెప్పాడు. మొదట ఈయన మౌనం చూసి అందరూ ఆయన్ను తప్పుబట్టారు గాని ఇప్పుడు మాత్రం ఆయన మౌనమే కరెక్ట్ అని భావిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ప్లాన్ సూపర్ హిట్ అయిందన్నమాట.