పవన్ చేసిన ఆ ప్రకటన..సినిమాకు కలిసొచ్చింది.. మరి రాజకీయాలకో..?

Sunday, April 17th, 2016, 03:49:54 PM IST


పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర డబ్బులు లేవని, ఆఫీసు నడపడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. స్టాఫ్ కు కూడా నెలవారిగా జీతాలు ఇవ్వలేకపోతున్నానని… కాని, రాజకీయాలలో తప్పకుండా రాణిస్తానని పవన్ చెప్పాడు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ ఒక్కసారిగా చలించిపోయారు. సర్దార్ సినిమా విడుదలైంది. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోయింది. అదే సర్దార్ గబ్బర్ సింగ్ ఏమాత్రం ఫర్వాలేదు అని అనిపించినా.. కలెక్షన్ల పరంగా మరింతగా దూసుకుపోయేది. కేవలం వారం రోజులలోనే సర్దార్ గబ్బర్ సింగ్ 50 కోట్లు వసూలు చేసింది అంటే.. పవన్ కళ్యాణ్ ప్రకటనకు ఫ్యాన్స్ ఎంతటి విలువ ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఇదిలా ఉంటె, దిది సినిమా కాబట్టి ఫ్యాన్స్ డబ్బులు పెట్టి సినిమా చూశారు. పవన్ కు ఏదో హెల్ప్ చేశారు. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమా మూడు గంటలు మాత్రమే ఉంటుంది. కాని, ఒక్కసారి ఓటేసి గెలిపిస్తే.. అధికారంలో ఐదు సంవత్సరాలపాటు ఉంటారు. అనుకున్న విధంగా మంచిగా పరిపాలన చేస్తే.. ఒకే. కాని, అధికారం చేతులోకి వచ్చాక ప్రజలను పట్టించుకోకుండా.. తమ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు దండుకోవాడని ప్రయత్నిస్తే..ఇబ్బందులు పడక తప్పదు. పవన్ కళ్యాణ్ అక్కడ చేసిన ప్రకటన ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.