పవన్ కేసీఆర్ ను పొగడటానికి కారణం ఏమిటి..?

Monday, April 11th, 2016, 01:10:54 PM IST


ఎప్పుడు ఏ చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వని పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత వరసగా మ్యాగజైన్ లకు, చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున ఓ ప్రముఖ తెలుగు చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో అనేక విషయాల గురించి తన మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నారు.

పవన్ ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్తూనే.. తెలంగాణలో అధికారంలో ఉన్న కెసిఆర్ పాలన బాగుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత, సేటిలర్లకు న్యాయం చేస్తూ.. పాలన సాగిస్తున్నారని.. సేటిలర్ల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేఖత లేకపోవడం ఇందుకు నిదర్శనం అని పవన్ పేర్కొన్నారు. ఇక కెటిఆర్ లో నాయకత్వ ప్రతిభ ఉన్నదని పవన్ చెప్పడం విశేషం.

అయితే, ఒక్క విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ కెసిఆర్ తో వ్యతిరేఖించారు. ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానించడం నచ్చలేదని.. వేరే పార్టీల నేతలను కలుపుకొని పోవడం అవసరామా అని పవన్ ప్రశ్నించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని పవన్ స్పష్టం చేశారు.