‘పవన్ కళ్యాణ్’ ఇప్పటికైనా మారుతాడా..?

Monday, July 18th, 2016, 09:10:00 AM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయంగా ఏమంత యాక్టివ్ గా కనిపించడంలేదు. ఇంతకు మునుపైనా ట్విట్టర్ వంటి సోషల్ సైట్లలో అభిమానులను, ప్రజలను, రాష్ట్రాన్ని, నాయకులను ఉద్దేశించి ఏదో ఒకటి చెబుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు. ప్రస్తుతం సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఆయన 2019 ఎన్నికలకు బలపడాలంటే మాత్రం ఖచ్చితంగా పంథా మార్చి జనాల్లోకి వచ్చి తీరాల్సిందే.

సభలు, సమావేశాలు, పాదయాత్రలు వంటి వాటితో జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అధికార పక్ష, ప్రతిపక్ష పార్టీలు రాబోయే ఎన్నికలకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. వారిని మించాలంటే పవన్ కూడా తొందరపడాల్సిన అవసరం ఉంది. అభిమానులు సైతం తన నాయకుడు ఎప్పుడెప్పుడు ఆదేశాలిస్తాడా, ఎప్పుడెప్పుడు రంగంలోకి దిగుదామా అన్న కుతూహలంతో ఉన్నారు. పవన్ గనుక ఇంకా ఆలస్యం చేస్తే వాళ్లలో ఉన్న ఆ ఉత్సాహం కాస్త నీరుగారుతుంది. కాబట్టి పవన్ ఇకనైనా కాస్త పద్దతి మార్చి ముందుకెళితే మంచిది.