జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు తన అభిమానులకు ఊహించని బహుమతి ఇచ్చారు.పవన్ ఇప్పటికే తన ప్రజా పోరాట యాత్రలో మునిగిపోయి తన లుక్ మీద పెద్ద శ్రద్ధ పెట్టలేదు.అయితేనేం తన యాత్రలోనే ఎన్నో ఊహించని క్లిక్స్ తో పవన్ అభిమానులకు కిక్ ఇస్తున్నారు.పవన్ కూడా సినిమాలు మానేసినా సరే తమకోసం రోజుకొక ఫస్ట్ లుక్ ఇస్తున్నారని అతని అభిమానులు కూడా అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మాత్రం పవన్ తన ప్రజా పోరాట యాత్రకు బ్రేక్ ఇచ్చారు.ఇక ఇదే సమయం అనుకున్నారేమో పవన్ ఇప్పటివరకు పెంచుకున్న తన గుబురు గడ్డాన్ని పూర్తిగా తీసేసి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చారు.దానికి తోడు పవన్ యొక్క తల్లి ఈ రోజు ఆయన పార్టీకి విరాళంగా 4 లక్షలు ఇవ్వగా పవన్ యొక్క కొత్త లుక్స్ బయటకి వచ్చాయి.ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అవే హల్ చల్ చేస్తున్నాయి.ఈ ఫోటోలలో పవన్ క్లాసీ లుక్ తో ఒక్క సారిగా అతని అభిమానులకు ఊహించని బహుమతిని అందించారు.