తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం పవన్ కల్యాణ్ పొలిటికల్ సీన్. 2019 ఎన్నికల్లో ఎవరికీ తన సపోర్ట్ ఉండదని.. తాను ప్రత్యాన్మాయ రాజకీయాలే చేస్తానని చెప్పిన పవన్ తన దగ్గర ఎన్నికలను నడిపేంత డబ్బు లేదని.. అందుకే ఇంకొన్ని సినిమాలు మాత్రమే చేసి బయటకు వచ్చేస్తానని కూడా చెప్పారు. అలాగే 2019 కల్లా పూర్తి స్థాయి పార్టీని, కార్యాచరణను నిర్మించడానికి పవన్ ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టేసినట్టు తెలుస్తోంది.
అధికార ప్రతిపక్షాలు రెండూ ఇప్పటికే భవిష్యత్ ఎన్నికల కోసం సంసిద్దమవుతున్నాయి. దీంతో పవన్ కూడా తన అనుచర గణాన్ని రంగంలోకి దింపి ప్రస్తుత రాజకీయాల పట్ల ప్రజల్లో అంతర్గతంగా ఉన్న అభిప్రాయాలను, తన నుండి అసలు వాళ్ళేమి ఆశిస్తున్నారన్న అంశాలను తెలుసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. అలాగే త్వరలో పవన్ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారని కూడా వినికిడి. మొత్తానికి పవన్ 2019 నాటికి ఎలాంటి లెక్కలు వేసుకుని ఎంతమంది లెక్కలు తేలుస్తాడో చూడాలి.