టీడీపీ పై జనసేనాని మరో సారి సంచలన ట్వీట్.!

Thursday, November 1st, 2018, 10:11:06 PM IST

గత కొద్ది రోజులు వరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ప్రజాపోరాట యాత్రలో నిర్వహించే సభల్లో తెలుగుదేశం ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసినదే.అయితే ఇప్పుడు తన యాత్రకు బ్రేక్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీని విమర్శించడంలో మాత్రం బ్రేకులు ఇవ్వడం లేదు.సోషల్ మీడియా సాక్షిగా టీడీపీ మీద తన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.మొన్నటికి మొన్నే రైతుల భూములు అన్యాయంగా లాక్కోవడానికి టీడీపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది అదే గాని నిజమైతే రైతులకు అండగా నేను ఉండి మీ మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అని వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయితే గత కొద్ది రోజులు నుంచి కొన్ని గ్రామాల్లో మరియు మరికొన్ని చోట్ల సర్వ్ పేరిట చంద్రబాబు యొక్క మనుషులు ప్రజల దగ్గరకి వెళ్లి వారు ఏ పార్టీకి ఓటు వెయ్యాలనుకుంటున్నారో కనుక్కొని ఒకవేళ వారు జనసేన పార్టీకి ఓటేస్తామని తెలిపితే వారి యొక్క వేలి ముద్రను తీసుకొని అతి కొద్ది నిమిషాల్లోనే వారి ఓట్లను మాయం చెయ్యడం జరిగింది.దీనితో అప్రమత్తమైన ఓటర్లు వారిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

ఇప్పుడు గుంటూరులో కూడా అదే సంఘటన చోటు చేసుకోవడంతో పవన్ మళ్ళీ తన ట్విట్టర్ కి పని పెట్టారు.”చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను.” అని ట్వీట్ పెట్టారు. అయితే పవన్ ఎప్పటి నుంచో వారి పార్టీకి సంబందించిన 21 లక్షల ఓట్లు తీయించేశారని చాలా సార్లు ఆరోపించారు.అయితే ఈ చర్యలు చూస్తే అది నిజమని నమ్మక తప్పడం లేదు.