నేను చంద్రబాబులా వెన్నుపోటు పొడిచే రకం కాదు..పవన్ సంచలన వ్యాఖలు!

Saturday, November 3rd, 2018, 11:52:31 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రజా పోరాట యాత్ర మళ్ళీ మొదలు పెట్టిన సంగతి తెలిసినదే.నిన్న రైలు ప్రయాణంతో మొదలు పెట్టిన ఈ యాత్ర ప్రస్తుతం కత్తిపూడిలో సాగుతుంది.ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి బహిరంగ సభలో పవన్ మరో సారి చంద్రబాబు పై విమర్శలు కురిపించారు.చంద్రబాబు గారు నిజంగా ప్రత్యేకహోదా కోరుకున్న వ్యక్తే అయితే అన్ని పార్టీలను పిలిచి ఒక మీటింగ్ పెట్టమనండి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయ్ వాటి మీద బాబు గారు క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించారు.పవన్ ను బీజేపీ వెనకుండి నడిపిస్తుందన్న మాటలకు గాను పవన్ ఘాటుగానే తన స్పందనను ఇచ్చారు.నేను భారతీయ జనతా పార్టీని వెనకేసుకు రావడానికి నేనేమి మీలా అవకాశవాద రాజకీయాలు చెయ్యనని, దొంగదెబ్బలు వెన్నుపోట్లు పొడవను అని వ్యాఖ్యానించారు.ఏదైనా ఉంటే డైరెక్టుగానే మాట్లాడుతాను కానీ మీలా వెన్ను పోట్లు పొడిచే వ్యక్తిని కాదు అని మండిపడ్డారు.