పక్కా వాస్తు.. పర్ఫెక్ట్ ప్లానింగ్

Sunday, March 20th, 2016, 07:24:05 PM IST


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా మొదట తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టింది ప్రభుత్వం. దానికి సంబందించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. గుంటూరు జిల్లాలోని వెలగపూడి గ్రామంలో జరుగుతున్న పనులను తాజాగా మంత్రి నారాయణ సైతం పర్యవేక్షించారు. ఇకపోతే ఈ సచివాలయానికి వాస్తి నిపుణులంతా కలిసి పక్కా వాస్తును సెట్ చేసినట్టు తెలుస్తోంది.

సచివాలయంలో ముఖ్యమంత్రి ఆఫీస్ స్థలాన్ని నైరుతిలో ఉండేట్లు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే మునుపు పడమర దిక్కుగా ఉన్న అసెంబ్లీ స్థానాన్ని.. తూర్పు దిక్కుగా మార్చినట్లు కూడా తెలుస్తోంది. ఈ తాత్కాలిఅక్ సచివాలయానికి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవనున్నట్లు అంచనా. ఇలా పక్కా వాస్తు, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేపడుతున్న ఈ నిర్మానాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.