లేడీస్ ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తున్న ఫోటో స్టూడియో

Wednesday, April 4th, 2018, 04:07:25 PM IST

ఇటీవల కాలం లో మహిళల ఫై అకృత్యాలు బాగా పెరిగాయి. అంతే కాక కొందరు మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారి ఫోటోలకు అశ్లీల చిత్రాల బొమ్మలు అతికించి ఇంటర్నెట్ లో పెడుతున్నారు. అయితే ఇంత నీచమయిన, హేయమైన చర్యలకు పాల్పడుతున్న ఒక ఫోటో స్టూడియో ను పోలీస్ లు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే, కేరళ లోని వివిధ వివాహ కార్యక్రమాల్లో పాల్గొనే వేలాది మంది మహిళల ఫొటోలు తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో సర్క్యులేట్‌ చేస్తున్నారు సదయమ్‌ షూట్‌ అండ్‌ ఎడిట్‌ స్టూడియో సిబ్బంది. అయితే ఇటీవల ఒక మహిళ తన మార్ఫింగ్‌ ఫొటోను ఇంటర్నెట్లో గుర్తించడంతో అసలు విషయం బయటపడింది.

దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కోజికోడ్‌ జిల్లాలోని వడకర పట్టణంలోని సదయమ్‌ స్టూడియోను పోలీసులు సీజ్‌ చేశారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని స్టూడియో యజమానులు సతీశన్‌, దినేశ్‌లను అరెస్ట్‌ చేశారు. కేసులో మరో ప్రధాన నిందితుడు బిబేశ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్టూడియో యజమానుల అరెస్ట్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు.

ఓ మీడియా కథనం ప్రకారం వేర్వేరు వివాహ కార్యక్రమాల్లో తీసిన మహిళలకు సంబంధించి 40వేల ఫొటోలు స్టూడియోలోని హార్డ్‌ డిస్క్‌లో ఉన్నాయి. పోలీసులు ఆ హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు….