పోలీస్ కానిస్టేబుల్ వివాహేతర సంబంధం……తెలుసుకుని షాకిచ్చిన భార్య!

Friday, April 27th, 2018, 01:13:02 PM IST

వివాహం తరువాత భార్య భర్తలు ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఉండడం అన్నిటికంటే ముఖ్యమని మన తల్లితద్రులు, పెద్దలు ఎందరు చెపుతున్నప్పటికీ, అక్కడక్కడ కొందరు మాత్రం అక్రమ సంబంధాలతో తమ జీవిత భాగస్వాములను దూరంచేసుకుంటున్నారు. ఇటువంటి సంఘటనే సిద్ధిపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే సిద్ధిపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్, మమతా అనే యువతిని 2006లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

వీరి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా బాపూజీ గూడెం. కొన్నాళ్ల తర్వాత 2011 లో రమేష్ కి కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. కాగా ప్రస్తుతం వారికీ ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. అయితే గత కొద్దికాలంగా భార్య, బిడ్డలకు దూరంగా జీవిస్తున్న రమేష్ అక్కడ మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత కొద్దిరోజుల ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని భార్య ఆరా తీయగా రమేష్ ఇంకొక మహిళతో ఉంటున్నట్లు తెలిసింది. అంతే, వున్నట్లుండి అతని ఇంటికి చేరుకొని వారిద్దరిని పట్టుకుని చితకబాదింది. అంతటితో వదలకుండా రమేష్ పై పోలీస్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీస్ లు రమేష్ పై చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది……