జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్..!

Wednesday, April 3rd, 2019, 02:15:21 PM IST

కొంత కాలం కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ అధినేత జయరాం హత్యకేసులో ముగ్గురు ఖాకీలపై వేటు పడింది. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

సస్పెన్షన్ కు గురైన ముగ్గురు పోలీసు అధికారులు జయరాం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని రాకేష్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు మొదట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసు అధికారులకు పూర్తి ఆధారాలు లభించటంతో ఈ ముగ్గురికి రాకేష్‌రెడ్డితో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలిసి ముగ్గుర్ని సస్పెండ్ చేశారు. కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన పోలీసులే ఇలా అక్రమాలకు పాల్పడటం ఈ కేసులో నిజాలు తేలుతాయి లేదా అన్న సందేహాలకు తావిస్తోంది.