ఐదు రాష్ట్రాల్లో శంఖారావం మోగింది..!

Friday, March 4th, 2016, 04:28:35 PM IST


ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మే నెల వరకు రెండు నెలల కాలంలో దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదట అస్సాంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అస్సాం తరువాత పశ్చిమ బెంగాల్ లోను, తరువాత తమిళనాడులోను, ఆ తరువాత కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతాయి. మే 19న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది.

ఐదు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉన్నది.

అస్సాం – ఏప్రిల్ 4,11
పశ్చిమ బెంగాల్ – ఏప్రిల్ 4, 11, 17, 21, 25, 30 మరియు మే 5
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ – మే 16
ఎన్నికల కౌంటింగ్ మే 19 న ఉంటుంది. ఇక ఈ ఎన్నికలలో నోటాకు ప్రత్యేకమైన గుర్తు ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది.