పొలిటికల్ సెటైర్స్ : వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప..?

Tuesday, December 15th, 2015, 11:30:39 AM IST

బాబాయ్: అబ్బాయ్ ..కేసీఆర్ విజయవాడకు వెళ్లాడంటగా..?
అబ్బాయ్: అవును. వెళ్ళాడు.
బాబాయ్: ఎందుకో..?
అబ్బాయ్: చంద్రబాబుని ఆహ్వానించడానికి.
బాబాయ్: దేనికి..? యాగానికా..?
అబ్బాయ్: అవును బాబాయ్.
మరి కోట్లు ఖర్చు పెట్టి చేసుకునేటప్పుడు మాజీ సోదరులని పిలవకుంటే ఎలా..?
బాబాయ్: కోట్లా.. ఎన్ని కోట్లు..?
అబ్బాయ్: చంద్రబాబు గారు శంఖుస్థాపనకి 400 కోట్లు ఖర్చు పెట్టారు.
ఇప్పుడు కేసీఆర్ 3 కోట్లు.
బాబాయ్: అదేంటి చంద్రబాబు 400 కోట్లు ఖర్చు పెడితే..కేసీఆర్ 3 కోట్లేనా..?
ఇదేం బాగోలేదు.
అబ్బాయ్: ఏం బాగో లేదు? తక్కువ ఖర్చు పెడితే మంచిదేగా.
బాబాయ్: అయితే చెప్పు ఎక్కువ ఖర్చు పెట్టిన చంద్రబాబు గొప్పా..?
లేక ప్రజాధనాన్ని తక్కువ ఖర్చు పెట్టిన కేసీఆర్ గొప్పా..?
అబ్బాయ్: అబ్బో..భలే చిక్కు ప్రశ్నే అడిగావ్ బాబాయ్.
ఉండు సమాధానం ఆలోచించి మళ్ళీ చెబుతా.