పొలిటికల్ సెటైర్స్ : అబ్బో ఎన్నో చెప్పి .. చివరకు చేసింది అదా..?

Monday, April 4th, 2016, 03:45:42 PM IST


బాబాయ్ :అరె అబ్బాయ్ ఆ పాట విన్నవంటారా ఎంత మధురంగా ఉన్నదో..
అబ్బాయ్ :ఎంతైనా పాట కదా బాబాయ్ మన నాయకులు మాట్లాడినట్టె తీయగా ఉంటుంది. నటులు నటించినట్టుగా కమ్మగా ఉంటుంది..
బాబాయ్ :ఏమైందిరా అలా మాట్లాడుతున్నావ్.. పాట బాగోలేదా..గొంతు నచ్చలేదా..
అబ్బాయ్ :వాళ్ళ వేషాలే నచ్చలేదు బాబాయ్. ప్రజలను నాయకులే కాదు.. నటులు కూడా మోసంచేస్తారని ఇప్పుడే తెలిసింది.
బాబాయ్ :మోసం ఏంట్రా కాస్త అర్ధం అయ్యేలా చెప్పరా..?
అబ్బాయ్ :నాయకులు నల్లధనాన్ని విదేశాలలో దాచుకున్నారని విన్నాం కాని.. నటులు కూడా నాయకుల బాటలోనే ఫాలో అవుతున్నారని.. ఈరోజు వరకు తెలియలేదు బాబాయ్. పోనీ ఎవరో ఏదో అనుకుంటే పొరపాటే..ఏకధాటిగా హిందీ పరిశ్రమను ఏలిన పెద్దస్టారే పన్నులు ఎగ్గొట్టాడంటే…ఏమనాలి.. ఆయన బాటలో ఎంతమంది ఉన్నారో ఇంకా.

బాబాయ్ :అంతేరా అబ్బాయ్.. ఎవరైనా అంతే. దొరకనంత వరకు అందరు మంచోళ్ళే… దొరికితేనే కదా తెలిసేది.