పొలిటికల్ సెటైర్స్ : వైఎస్ హయాంలో గుర్తుకు రానిది.. చంద్రబాబు పాలనలో గుర్తుకొచ్చిందా..?

Monday, June 20th, 2016, 10:22:46 PM IST


బాబాయ్ : ఏవిట్రా అబ్బాయ్.. ముద్రగడ ఇంకా దీక్ష విరమించినట్టు లేదు?
అబ్బాయ్ : అవును బాబాయ్.. ఇప్పటికే 11 రోజులయింది. అయినా ఏమాత్రం తగ్గడం లేదు.
బాబాయ్ : అయినా కొత్త రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వీళ్ళు ఇలా పట్టుబట్టడం సమంజసమేనా..?
అబ్బాయ్ : వాళ్లకు ఎప్పటి నుండో అన్యాయం జరుగుతోందట. అందుకే ఈ సారి గట్టిగా అడుగుతున్నారు.
బాబాయ్ : ఎన్నాళ్ళ నుండో జరుగుతుంటే అప్పుడే అడగొచ్చుగా?
అబ్బాయ్ : అప్పుడంటే ఎప్పుడు బాబాయ్..?
బాబాయ్ : అదేరా వైఎస్ హయాంలో ఈ సమస్య లేదా.. అప్పుడే ఆయన్ని నిలదీయోచ్చుగా..?
అబ్బాయ్ : వైఎస్ ఉన్నప్పుడు అడిగితే పని జరగదని అనుకున్నారో ఏమో..?
బాబాయ్ : అన్నీ ఉన్న అప్పుడే పని జరగనిది.. ఏమీ లేని ఇప్పుడెలా జరుగుతుంది..?