రాష్ట్రంలో కొత్త పార్టీ.. ఓట్లన్నీ దానికే పడతాయట..!

Wednesday, February 10th, 2016, 10:31:29 AM IST


ఏపీలో రిజర్వేషన్ రాజకీయాలు రాజుకుంటున్నాయి. కాపులు తమను బీసీల్లో చేర్చి రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే.. బీసీలు తమకు 54% రిజర్వేషన్లు కావాలని గళం వినిపిస్తున్నారు. నిన్న మంగళవారం బీసీ నేత ఆర్. కృష్ణయ్య సారథ్యంలో విజయవాడలోని ఐలాపురం హోటల్ లో రాష్ట్రంలోని 92 బీసీ సంఘాలు సమావేశమయ్యాయి.

ఈ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ ‘శాంతియుతంగా ఉద్యమించి హక్కులు రాబట్టుకోవాలి. బీసీ ప్రయోజనాలకు పాటుపడని పార్టీలు మాకు అవసరం లేదు. ఆ పార్టీలకు ఓటెయ్యొద్దు. త్వరలొనే కాపు రిజర్వేషన్ కు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో సభలు నిర్వహిస్తాం. బీసీల కంటే కాపులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందున్నారు. రిజర్వేషన్ పై సమగ్ర సర్వే జరిఫై నిర్ణయం తీసుకోవాలి. బీసీలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రంలో చివరికి బీసీ పార్టీలే మిగులుతాయి’ అన్నారు. పలువురు బీసీ నేతలు త్వరలొనే కృష్ణయ్య బీసీ పార్టీ పెట్టాలని అప్పుడు అధిక శాతం ఉన్న బీసీల ఓట్లన్నీ ఆ పార్టీకే పడతాయాని.. మిగతా పార్టీలు ఇక కనిపించవని అన్నారు. కృష్ణయ్య పార్టీ పెట్టాల్సిందేనని ఆయన చుట్టూ చేరి జై బీసీ అంటూ నినాదాలు చేశారు.