కాంగ్రెస్ కుట్రకు మన్మోహన్ బలి..!

Sunday, March 15th, 2015, 02:11:03 PM IST


కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని… తమకు ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది లేదని… అటువంటి అలమరికలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండేవని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ప్రధాని మోడీ ఆద్వర్యంలో దేశం, రాష్ట్రాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను కేంద్రం నేరవేర్చుతుందని జవదేకర్ స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలోను కేంద్రం తక్కువ చేయదని అన్నారు. తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉన్నదని…అన్నారు. నల్గొండ జిల్లా దామచర్లలో జెన్ కో ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించనున్నట్టు జవదేకర్ తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలో ఉండగా… అనేక కుంభకోణాలు జరిగాయని, దేశంలో అవినీతిని పెంచిపోషించిందని అన్నారు. కాంగ్రెస్ కుట్రకు నిజాయితీ పరులైన కొందరికి అవినీతి మరకలు అంటుకున్నాయని జవదేకర్ విమర్శించారు. దేశంలో సంష్కరణలు ప్రవేశపెట్టిన మన్మోహన్ వంటి ప్రధానులు కాంగ్రెస్ అవినీతి కుట్రకు బలికావలసి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.