ప్రణయ్ ను హత్య చేసిన హంతకుడు దొరికాడు..!

Tuesday, September 18th, 2018, 01:47:13 PM IST

కుల పిచ్చితో మదమెక్కిన తండ్రి తన కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న నెపంతో తాను మనిషిని అన్న సంగతి మర్చిపోయి తన అల్లుడిని అతి కిరాతకంగా హత్య చేయించిన ఘటన మొన్న మిర్యాలగూడలో చోటు చేసుకున్న సంగతి తెలిసినదే. అమృత తండ్రి మారుతీరావు తన కుమార్తె చేసుకున్న పెళ్ళికి ఎప్పటి నుంచో కక్ష కట్టుకొని ఎప్పటి నుంచో పక్కా పథకం ప్రకారం హత్య చేయించాడు.దీనికిగాను బీహారుకు చెందిన ఒక వ్యక్తికి 10 లక్షల సుపారీ ఇచ్చి ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఈ దారుణ సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి హత్య చేసిన ప్రధాన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపులు చేపట్టారు. ఎట్టకేలకు ఆ హంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఐతే ఆ నిందితుడు బీహార్ లో సంచరిస్తుండగా అక్కడి పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఈ హత్య చేసిన నిందుతుడి పేరు శర్మ అని తెలియజేసారు. ఈ రోజు సాయంత్రం సమయానికల్లా ఆ నిందితుడిని బీహార్ నుంచి నల్గొండకు తరలిస్తారు అని, ఈ రోజు సాయంత్రమే శర్మను మీడియా ముఖంగా ప్రవేశపెట్టనున్నారు అని తెలుస్తుంది.దీనికి కారణమైన ఏ ఒక్కరిని తన బిడ్డ పుట్టే సమయానికల్లా క్షమించకుండా ఉరి తియ్యాలి అని ప్రణయ్ భార్య తెలియజేసారు.