ప్రియాంక చోప్రాకు అరుదైన గుర్తింపు

Thursday, December 4th, 2014, 05:05:15 PM IST


బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు అరుదైన గుర్తింపు ల‌భించింది. తాజాగా ఆమె వ‌రల్డ్ సెక్సీయస్ట్ ఆసియన్ ఉమెన్ గా ఎన్నికైంది. లండన్ లో జరిగిన పోటీల్లో గత విజేత కత్రినా కైఫ్ ను ప్రక్కకు నెట్టి ఆ స్థానాన్ని చేజిక్కించుకుంది ప్రియాంక‌. యూకే వీక్లీ న్యూస్ పేపర్ ‘ఈస్ట్రన్ ఐ’ నిర్వహించిన ఈ పోటీలో 50 మంది భామలను వెన‌క్కి నెట్టి ప్రియాంక ఫ‌స్ట్ ప్లేస్ సంపాదించింది.

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు ఈ పోటీల్లో నిరాశ ఎదురైంది. గత ఏడాది నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ భామ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.