లింగాపై వివాదం.. విడుదలకు క్లియరెన్స్

Thursday, December 11th, 2014, 05:52:03 PM IST

lingaa-poster
రజనీకాంత్ హీరోగా నటించిన లింగా సినిమా విడుదలకు ముందే అనేక వివాదాలలో చిక్కుకున్న విషయం తెలిసిందే. లింగా సినిమా ఇంద్ర సినిమా కధను పోలి ఉన్నదని ఓ తమిళ నిర్మాత చెన్నై కోర్ట్ లో పిర్యాదు చేశారు. ఇంద్ర సినిమాను తమిళ హక్కులను బాలాజీ స్టూడియోస్ పొందిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు తమ కథను పోలిన కథతో లింగా సినిమా వస్తున్నదని చెప్పి ఆ నిర్మాత కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై ఈ రోజు విచారణ జరిపారు. ఇక లింగా సినిమా నిర్మాత ఐదు కోట్ల రూపాయల నగదును మరో ఐదు కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్ ను కోర్టకు సమర్పించాలని ఆదేశించింది. అయితే… సినిమా విడుదలపై కోర్ట్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో రేపు రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా రేపు ప్రపంచవ్యాప్తంగా 2000 థియోటర్లలో సినిమా విడుదల అవుతున్నది.