చేతిలో టీచర్ తలను పట్టుకొని పరిగెత్తాడు!

Wednesday, July 4th, 2018, 11:03:50 AM IST

ఒక చేతిలో కత్తిని పట్టుకొని మరో చేతిలో మహిళ తలను పట్టుకొని వీధుల గుండా పరిగెడుతుంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. అదే తరహాలో జార్ఖండ్ ప్రజలకు ఒక వ్యక్తి వెన్నులో వణుకు పుట్టించాడు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనజార్ఖండ్ లోని జమ్ షడ్ పూర్ లో చోటు చేసుకుంది. అతన్నీ పట్టుకోవడానికి కొంత మంది స్థానిక యువకులుకు పోలీసులకు చాలా సమయం పట్టింది.

అసలు వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హరీ హెంబ్రామ్ అనే వ్యక్తి మానసిక వికలాంగుడు. అయితే మధ్యాహ్న భోజన సమయంలో సేరైకేలాలోని ఖప్రసాయ్ ప్రైమరీ స్కూల్ వద్దకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని బయటకు రమ్మని చెప్పాడు. అందరూ చూస్తుండగానే నిమిషాల్లో తన దగ్గర ఉన్న రెండు కత్తులతో మహిళపై దాడి చేశాడు. ఆ తరువాత పదునైన కత్తితో తలను మొండాన్ని వేరుచేసి తలను ఎత్తుకొని పరిగెత్తాడు.

దీంతో స్థానికులు కొందరు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారు కూడా హంతకుడి కోసం పరిగెత్తసాగారు. చివరికి సమీపంలో ఉన్న ఒక అడవిలో అతన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే స్థానికులు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఘటనకు సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.