బయటపడిన రొమాన్స్.. తెలివిగా భార్య అది కట్ చేసింది !

Wednesday, February 21st, 2018, 10:42:27 PM IST

ఆడవారు చాలా సున్నితంగా ఉంటారు అనేది ఎంత నిజమో కోపం వస్తే మాత్రం అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉగ్రరూపం దాలుస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో కొంత మంది మహిళలు వారిపై జరిగే దాడులను చాలా ఈజీగా తిప్పికొడుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఏడడుగులు నడిచిన భర్త తప్పు చేయడంతో ఒక భార్య చేసిన పని సంచలనం సృష్టించింది. ఏ మాత్రం కనికరం లేకుండా ఆమె ఆలోచించిన తీరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆజాద్‌ సింగ్‌, అతని భార్య జోగిందర్ నగర్ లో గత కొన్నేళ్లుగా జీవనానికి కొనసాగిస్తున్నారు. అయితే ఆజాద్ స్థానికంగా ఉండే మరొక మహిళతో గత కొంత కాలంగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో భార్య అతనితో చాలా గొడవపడింది, ఎన్ని సార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో భార్య అతను నిద్రిస్తున్న సమయంలో రాడ్డుతో తలపై గాయపరిచి ఆ తరువాత కత్తితో అతని మర్మాంగాన్ని కోసి పారేసి బేసిన్ లో పడేసింది. విషయం తెలుసుకున్న ఆజాద్ తండ్రి వెంటనే హాస్పిటల్ కి తరలించి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.