ఫోటో మూమెంట్ : రియో కార్నివాల్ లో టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ సందడి

Wednesday, February 18th, 2015, 08:36:14 AM IST


బ్రెజిల్ రాజధాని రియో డి జనీరియోలో 2015 రియో కార్నివాల్ ఘనంగా జరుగుతున్నది. ఎంతో అద్బుతంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో రియోకు తరలివస్తారు. ప్రపంచంలో జరిగే గొప్ప ఉత్సవాలలో రియో కార్నివాల్ కూడా ఒకటి. కాగా, ఈ కార్నివాల్ ను వీక్షించేందుకు స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు, క్లే కింగ్ గా పేరుగాంచిన రాఫెల్ నాదల్ కూడా తరలిరావడం విశేషం. కార్నివాల్ ను తన మొబైల్ లో బందిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.