రజనీకాంత్ మ్యాజిక్ మార్క్ ‘లింగా’.. ?

Thursday, December 11th, 2014, 07:57:15 PM IST

lingaa
రజనీకాంత్ నటించిన లింగా సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన హక్కులను ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సొంతం చేసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా రేపు 2500లకు పైగా థియోటర్లలో విడుదల అవుతున్న ఈ చిత్రం ఇప్పటికే నిర్మాతకు లాభాన్ని చేకుర్చినట్టు తెలుస్తున్నది. మొత్తం 50కోట్ల రూపాయలకు పైగా టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు సమాచారం.

రజనీకాంత్ స్టైలిష్ మార్క్ ఈ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుందని సినివర్గాలు చెప్తున్నాయి. బ్రిటిష్ కాలంనాటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సినిపండితులు అంటున్నారు. ఇక రజనీకాంత్ సినిమాలలో మొన్న వచ్చిన కొచ్చాడియన్ సినిమా ఎంతటి ఘోర పరాజయం మూటకట్టుకున్నదో మనందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు వస్తున్న లింగా సినిమాపై ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. అభిమానుల అంచనాలను నిలబెట్టే విధంగా ఈ లింగా సినిమా ఉంటుందని సినిమా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.