లింగ’ సినిమా ‘ఇంద్ర’కు కాపీ అంటూ కేసు!

Wednesday, December 10th, 2014, 02:39:25 PM IST

విడుదలకు సిద్ధమైన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘లింగా’కు కాపీ కష్టాలు వెంటాడుతూనే వున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’కు ‘లింగా’ సినిమా కాపీ అంటూ తాజాగా మరో కేసు నమోదైంది. ‘ఇంద్ర’ తమిళ రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన నిర్మాతలు ‘లింగా’ సినిమా విషయంలో కోర్టును ఆశ్రయించారు. తమిళనాడుకు చెందిన బాలాజీ స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్ తరపున కార్తీక మద్రాస్ హైకోర్టులో ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేశారు. 2010లో తాము ‘ఇంద్ర’ చిత్ర హక్కులను కొనుగోలు చేశామని, అదే కథతో ‘లింగా’ మూవీ తీశారని కార్తీక ఆరోపించారు. ఈ పిటీషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు, విచారణను 11కు వాయిదా వేసింది.

అయితే ‘లింగా’ సినిమాను రజినీ బర్త్ డే సందర్భంగా ఈ నెల 12న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.