వారితో చర్చలు లేవు – అందరినీ హతమారుస్తాం!

Thursday, December 25th, 2014, 12:35:24 PM IST


అస్సాంలో ఇటీవల బోడో తీవ్రవాదులు సృష్టించిన నరమేధం సంగతి తెలిసిందే. కాగా ఈ మారణకాండపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలలో ‘బోడో తీవ్రవాది’ అన్న పదం వినకుండా అందరినీ హతమారుస్తామని ప్రకటించారు. అలాగే బోడో తీవ్రవాదులు శాంతికి కట్టుబడినా వారితో చర్చలు జరపమని, వారు ఉగ్ర చట్టాల ప్రకారం శిక్షను ఎదుర్కోవలసిందేనని కేంద్ర హోంమంత్రి ఆగ్రహంతో హెచ్చరించారు. ఇక తీవ్రవాదులను అంతమొందించడానికి ‘ఆల్ అవుట్’ స్పెషల్ ఆపరేషన్ ద్వారా పోలీసులు రంగప్రవేశం చేయనున్నారని రాజ్ నాధ్ సింగ్ పేర్కొన్నారు.