స్వర్గానికి లక్ష చాలంట!

Friday, November 28th, 2014, 05:50:50 PM IST


వివాదాస్పద బాబా రాంపాల్ ను అరెస్ట్ చేసిన తరువాత ఆయన గురించిన అనేక విషయాలు ప్రపంచానికి బహిర్గతం అవుతున్నాయి. ఆయనను అరెస్ట్ చేసిన మరుసటి రోజున ఆశ్రమంలో అనేక ఆయుధాలు బయటపడ్డాయి. ఇక ఆ తరువాత ఆశ్రమంలో గర్భానిర్ధారణ కిట్ లు బయటపడటంతో అనేక ఆశ్రమంపై నిఘాను పెంచారు. ఇక రాంపాల్ ను పోలీసు కష్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చేస్తున్నాయి.

రాంపాల్ ఆశ్రమంలోకి రావాలనుకునేవారు ముందుగా…బాబా ప్రవచనాలను వినాలంట… ఈ ప్రవచనాలకోసం ఆయన భక్తుల వద్ద నుంచి 1000 రూపాయలను వసూలు చేస్తారు. వెయ్యి రూపాయలు కట్టిన భక్తులకు బాబా గురు మంత్రను బోధిస్తారు. గురుమంత్ర అంటే గాయత్రి మంత్రం అంట. దీనిని రాంపాల్ ఆశ్రమంలో నామ్ ధామ్ అని పిలుస్తారు. మూడు నెలల పాటు ఈ మంత్రాన్ని పాటించిన తరువాత మరో 9000 వసూలు చేసి… సత్యలోక్ ఆశ్రమంలో ప్రైమరి మెంబర్ షిప్ ఇస్తారు. దీనిని సత్ నామ్ అంటారు. ఇక ఏకంగా స్వర్గానికి వెళ్ళాలంటే.. లక్ష ఉంటే చాలంట. రాంపాల్ తన భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు.