ట్రైన్లో మహిళపై రేప్….మ్యాటర్ ఏంటంటే?

Wednesday, August 8th, 2018, 07:36:49 PM IST

ఒకప్పటి కాలంతో పోలిస్తే నేటికాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాళ్లు అయితే వయోబేధం కూడా లేకుండా చిన్న పిల్లల జీవితాలను సైతం నాశనం చేస్తున్న ఘటనలు మనం అక్కడక్కడా చూస్తున్నాం. ఇక ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఒక మహిళపై ట్రైన్ లో రేప్ జరిగింది. ఇప్పటికే ఆడవారి భద్రత మరియు వారిపై జరుగుతున లైంగిక దుశ్చర్యల విషయమై మధ్యప్రదేశ్, దేశంలోనే అగ్రస్థానంలో వుంది. ఇక జరిగిన ఈ ఘటన వింటే ఎవరికైన హృదయం చెలించక మానదు. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ నగరంలోని మదన్ మహల్ రైల్వే స్టేషన్ లో ఒక మహిళ నిన్న రాత్రి వింధ్యాచల్ ఎక్స్ ప్రెస్ లోని ఒక జనరల్ భోగిలో ఎక్కింది.

కాసేపటికి నిద్రిస్తున్న ఆమెపై ఒక దుండగుడు అమాంతం వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక అదే సమయంలో ట్రైన్ లో విధులు నిర్వహిస్తున్న ఒక రైల్వే పోలీస్ ఆఫిసర్ ఆ ఘటనను చూడడంతో వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నాడు. కాగా వెంటనే అతడిని సమీప స్టేషన్ వద్ద వున్న పోలీస్ స్టేషన్ కి తరలించామని, అతడి పేరు ఉమేష్ వాల్మీకి అని, అతడు ఒక దినసరి కూలి అని తెలిసిందని చెప్పారు. అతనిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు చెపుతున్నారు. కాగా ఆ మహిళ ఇనుప సామానులు, మరియు ప్లాస్టిక్ వస్తువులు సేకరిస్తూ వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తుందని చెప్పారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించినట్లు తెలిపారు…..