ఎట్టకేలకు దొరికిన రవిప్రకాష్ ఆచూకీ – అరెస్టులో ఎందుకింత జాప్యం…?

Wednesday, May 15th, 2019, 09:06:59 PM IST

గత కొంత కాలంగా వివాదాలతో సహవాసం చేస్తున్నటువంటి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఆచూకీ పోలీసులకి దొరికింది. కానీ అరెస్టులో ఎందుకింత జాప్యం అని విశ్లేషకులు అంటున్నారు. కాగా రవిప్రకాష్ వివాదంలో పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి… ఫోర్జరీతో పాటు డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి ప్రకాశ్‌కు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేశారు. కాగా రవిప్రకాష్ ఇప్పటికి కూడా ఒక్క విచారణకు హాజరు కాకపోగా, ఎలాంటి స్పందన ఇవ్వడంలేదు. కాగా ఈసారి జరిగే విచారణకు హాజరు కాకపోతే మాత్రం రవిప్రకాష్ ని అరెస్టు చేయాలనీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కాగా నేడు ఉదయం సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట రవిప్రకాశ్ హాజరుకావాల్సింది కానీ కాగా ఆయన హాజరు కాలేదు. అది కాకుండా ఆయనకు తెలంగాణ హై కోర్ట్ లో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వేసిన పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా రవిప్రకాష్ బెయిల్ పిటిషన్ కూడా హై కోర్ట్ తిరస్కరించింది. అయితే రవిప్రకాష్ ప్రస్తుతానికి ఏపీలో రహస్యంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. కాగా రవిప్రకాశ్ ఫోర్జరీ చేశాడని చెప్తున్న సంతకంతోపాటు ఫోర్జరీకి గురైన వ్యక్తి అసలు సంతకాన్ని కూడా పోలీసులు సేకరించారు.

అయితే వాటిని సేకరించిన పోలీసులు వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. దానికి సంబందించిన ప్రాథమిక నివేదిక తెప్పించారని సమాచారం. వాటిని కోర్టు ఎదుట హాజరు పరచడానికి సిద్ధమయ్యారు పోలీసులు. ఏపీలో రవిప్రకాష్ ఆచూకీ దొరికినప్పటికీ కూడా తెలంగాణా పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.