మన పేపర్ తోనే కరెన్సీ ముద్రణ!

Thursday, April 2nd, 2015, 09:29:31 PM IST


భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిజర్వ్ బ్యాంక్ 80 వసంతాలు పూర్తి చేసుకున్న నేపధ్యంగా గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ ఉద్యమంతో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ ఫోటోని విదేశాల్లోంచి దిగుమతి చేసుకున్న పేపర్ పై ముద్రించడం సబబు కాదని పేర్కొన్నారు. అలాగే ‘మేక్ ఇన్ ఇండియా’ను ఇక్కడి నుండే ప్రారంభిద్దామని, మన పేపర్, మన ఇంకుతో కరెన్సీని ముద్రించగలమన్న నమ్మకం తనకు ఉందని మోడీ తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ‘ఈ రోజుతో ఆర్బీఐ 80 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. కనీసం ఇప్పటికైనా మన పేపర్, ఇంకుతో ఎప్పటిలోగా కరెన్సీని ముద్రించాగాలమో నిర్దేశించుకోగాలమా?’ అని వ్యాఖ్యానించారు. ఇక కరెన్సీకి ఉపయోగించే పేపర్ తయారీకి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఇండియా పేపర్ తో కరెన్సీ ముద్రిస్తామని ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా స్పష్టం చేశారు.