హుధూద్ లో రియల్ హీరోలు

Sunday, November 30th, 2014, 08:13:54 PM IST


హుధూద్ తుఫాన్ సంభవించినపుడు అపార నష్టం జరిగిందని… ఆ సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థను ఎలా పునరుద్దరించారో… ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్న విషయాన్ని కమ్యూనికేషన్ స్పెక్టర్ శ్యామసుందర రావు మేము సైతం కార్యక్రమం ద్వారా వివరించారు. నాగార్జున కుటుంబం ప్రత్యేకంగా రూపొందించిన రియల్ హీరోస్ కార్యక్రమంలో పాల్గొని ఆయన కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి వివరించారు. గ్రామాల మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేసింది ఆయన ఈ కార్యక్రమంలో వివరించారు. అంతేకాకుండా… 14 సంవత్సరాల రామ్ అనే విద్యార్ధి హుధూద్ సంభవించినపుడు రేడియో కమ్యూనికేషన్ ద్వారా ప్రజలకు ఎలా సహాయం చేసింది వివరించారు.