రివ్యూ :యూ -టర్న్ – సస్పెన్స్ అండ్ థ్రిల్స్ తో కూడిన సినిమా

Thursday, September 13th, 2018, 06:54:34 PM IST

సమంత – ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం U-టర్న్. కన్నడ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ టాక్ ఉంది. పైగా సమంత ప్రమోషన్స్ లో నిత్యం పాల్గొనడం సినిమాకు కొంచెం బజ్ క్రియేట్ అయ్యింది. ఇక నేడు విడుదలైన యూ – టర్న్ ఎలాంటి మలుపులతో మెప్పించిందో చూద్దాం.

కథ :

ఆర్కే పురమ్ ఫ్లైఓవర్ పై జరిగే సంఘటనల శ్రేణిపై వ్యాసాలను కవర్ చేయడానికి ఒక ఆంగ్ల రిపోర్టర్ రచన (సమంతా) సిద్దమవుతుంది. ఆ ప్రక్రియలో అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి మరియు వ్యక్తులను కలుసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. ఆమె జాబితాలో మొదటి వ్యక్తిని కలిసేటప్పుడు అనుమానాస్పద పరిస్థితులలో అతను సూసైడ్ చేసుకుంటాడు. పోలీసు బృందానికి చెందిన ఎస్ఐ నాయక్ (ఆది) రచనను ప్రశ్నించడానికి ఆమెను కస్టడీలోకి తీసుకుంటారు. ఆమె లిస్టులో ఉన్న వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారని రచణకు తెలుసు.అయితే ఎందుకు రచనా జాబితాలోని వ్యక్తులే ఆత్మహత్య చేసుకున్నారు? రచనకు మరియు ఆ ఆత్మహత్య మధ్య సంబంధం ఏమిటి? ఆమె నిధితురాల లేదా అమాయకూరలా? మిస్టరీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి ? ఈ ప్రశ్నల్లో స్పష్టత రావాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

మొదట దర్శకుడు పవన్ కుమార్ ను ప్రశంసించి తీరాల్సిందే. ఒక ఆసక్తికరమైన కథను అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు. అతను తగినంత సస్పెన్స్ మరియు థ్రిల్ నింపిన అంశాలతో ఈ సినిమాని ప్రజెంట్ చేశాడు. విరామం వరకు ఏం జరుగుతుందో ఊహించలేము. అలాగే జరుగుతున్న పరిణామాలు గందరగోళానికి గురిచేసినప్పుడు వాటి పరిష్కారం కోసం ఎలా పని చేస్తారు? అనే అంశం బావుంది. సెకండ్ హాఫ్ లో భూమిక పాత్రను ప్రవేశపెట్టిన తరువాత ఈ సినిమా పూర్తిగా భిన్నమైన రీతిలోకి మారుతుంది. సమంత తన పాత్రలో జీవించారని చెప్పాలి. ఒక రిపోర్టర్ గా ఆమె నటించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక ఆది కూడా పోలీస్ పాత్రలో మెప్పించాడు. మిగతా నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు. ఇక భూమిక పాత్ర కూడా సినిమాను ఊహించని మలుపు తిప్పుతుంది. రాహుల్ రవిచంద్రన్ కూడా తన పాత్రతో ఆకట్టుకున్నాడు.

ప్లస్ పాయింట్స్:

కథాంశం మరియి తెరకెక్కించిన విధానం
సరైన రన్ టీమ్
ప్రధాన తారాగణం పర్ఫామెన్స్

మైనెస్ పాయింట్స్:

కమర్షియల్ ఎలిమెంట్స్
సినిమా సీరియస్ గా సాగడం

తీర్పు:

కన్నడ రీమేక్ గా వచ్చిన యూ-టర్న్ మొత్తంగా తెలుగులో కూడా ఆకట్టుకుందని చెప్పాలి. సస్పెన్స్ ఏలిమెంట్స్ అండ్ గ్రిప్పింగ్ నరేషన్ సినిమాకు ప్రధాన బలం. అయితే మరోవైపు కమర్షియల్ ఎలిమెంట్స్, సీరియస్ గా సాగే కథ ఓ వర్గం ప్రేక్షకులకు కొంత నిరాశను తెప్పించవచ్చు. అయితే మొత్తంగా సరికొత్త మిస్టరీ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పవచ్చు.

Netiap.com Rating : 3.25/ 5

Reviewed by Netiap Team