‘టెంపర్’ అదుర్స్ అంట !

Friday, November 28th, 2014, 02:11:02 AM IST


నిత్యం వివాదసస్పద వ్యాఖ్యలతో… వార్తలలో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న టెంపర్ సినిమాపై తనదైన శైలిలో ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. టెంపర్ సినిమా ముందు మహేష్ పోకిరి.. బిజినెస్ మ్యాన్ సినిమాలు దిగదుడుపే అని అన్నారు. ఇక టెంపర్ సినిమాలోని కొన్ని సీన్స్ చూశానని… ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ అదుర్స్ అని అన్నారు. జగన్ గన్ అయితే అందులోనుంచి వచ్చే బుల్లెట్ తారక్ అని ఆయన ట్వీట్ చేశారు. తాను తారక్ తో సినిమా చేసేందుకు ట్వీట్ చేయడం లేదని… టెంపర్ లో తారక్ పెర్ఫార్మన్స్ చూశాక… తారక్ ను డైరెక్ట్ చేసే అర్హత తనకు లేదని అర్ధమయిందని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.