టిడిపి నేతలపై రోజా పిర్యాదు!

Wednesday, January 21st, 2015, 08:27:44 AM IST


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా టిడిపి నేతలపై ఎన్నికల అధికారికి పిర్యాదు చేసారు. కాగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారంటూ రోజా తన పిర్యాదులో పేర్కొన్నారు, వివరాలలోకి వెళితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రన్న కానుక పేరుతో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే పండగ ముగిసిన తర్వాత కూడా టిడిపి నేతలు చంద్రన్న కానుకలను పంపిణీ చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు రోజా పిర్యాదు చేశారు. అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే వారు ఆ విధంగా పంపిణీ చేస్తున్నట్లు రోజా తన పిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీనిని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించే చర్యగా రోజా వివరించారు. కాగా తిరుపతిలో ఎమ్మెల్యే వెంకటరమణ మరణానంతరం అక్కడ ఉపఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో రోజా ఈ విధంగా స్పందించారు.