బాలీవుడ్ లోకి మాస్టర్ బ్లాస్టర్

Thursday, January 8th, 2015, 04:48:46 PM IST


క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. కాగా సచిన్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్వయంగా సచినే తన పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. కాగా తన జీవిత విశేషాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్ లో కూడా సచిన్ సహకరిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ముంబైకి చెందిన 200 నాటౌట్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

కాగా 150కి పైగా ప్రకటనలు, షార్ట్ ఫిలింలను తీసిన ఈ సంస్థ వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ నుండి సచిన్ తో సినిమా తీసే హక్కులను తీసుకుంది. అలాగే లండన్ కు చెందిన ప్రముఖ రచయిత, దర్శక నిర్మాత అయిన జేమ్స్ ఎర్స్కైన్ ఈ సినిమా దర్శక బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఇక ఏడాది క్రితమే మొదలైన ఈ సినిమా పనులు ప్రస్తుతం షూటింగ్ వరకు వచ్చాయని సమాచారం.