120మంది మహిళలపై అత్యాచారం చేసిన పూజారి….!!!!

Sunday, July 22nd, 2018, 03:00:02 PM IST

రోజురోజుకు మనదేశం ఎటుపోతోందో, అసలు మహిళల భద్రత విషయమై ఏమిజరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా మహిళా రక్షణ విషయంలో ప్రభుత్వం డొల్లతనం, వ్యవహరిస్తున్న తీరుపై అందరినుండి సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. నాడు జాతాపిత మహాత్మా గదిగారు చెప్పినట్లు ఎప్పుడైతే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా ఎటువంటి భయం లేకుండా తన ఇంటికి చేరుకోగలుగుతుందో అప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని పలికిన మాటలు ఈ దేశశంలో ఎప్పటికి కూడా జరిగేలా అవకాశం కనపడడం లేదు. వయో బేధం, వావి వరసలు మరిచి కొందరు మృగాళ్లు ఆడవారిపై, చివరికి చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇక విషయంలోకి వెళితే, తండ్రి వయసున్న ఒక పూజారి ఏకంగా 120మంది మహిళల జీవితాలను నాశనం చేసిన ఉదంతం హర్యానా రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. హరియానాలోని ఫతేహాబాద్ లో గల తోహన పట్టణంలో 60 ఏళ్ళ వయసున్న బాబా అమర్ పూరి అలియాస్ బిల్లు అక్కడి స్థానిక బాలక్ నాథ్ గుడికి ప్రధాన పూజారిగా ఎన్నోయేళ్ల నుండి వ్యవహరిస్తున్నాడు.

తమ జీవిత సమస్యలు చెప్పుకోవడానికి తన వద్దకు వచ్చిన మహిళలకు వారి సమస్యలు తీరుస్తాను అని చెప్పి, వారితో తాంత్రిక పూజల నెపంతో ప్రసాదం, మరియు తీర్ధంలో మత్తుమందు ఇచ్చి, మత్తులోకి జారుకున్నాక వారిపై అత్యాచారం చేయడమేగాక, వీడియో కూడా తీసి బెదిరింపులకు గురిచేసేవాడు. అయితే ఇటీవల అతడు తీసిన వీడియోల్లో ఒకటి ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అవడంతో, బాబావద్దకు సాయంకోసం వచ్చిన మహిళల్లో ఒక మహిళ బంధువు అయిన వ్యక్తి ఆ వీడియోని చూసి పోలీస్ లకు ఫిర్యాదు చేసాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బిల్లు బాబా ని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచారు. ఈ విషయమై మాట్లాడిన బిల్లు, పోలీస్ లకు లంచం ఇవ్వనందునే తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపిస్తున్నాడు. కాగా అతనికి కోర్ట్ ఐదురోజుల రిమాండ్ విధించింది. అయితే బాబా పై ఆరోపణలు రావడం ఇది మొదటి సరి కాదని, ఇదివరకు కూడా అతనిపై ఒకసారి అత్యాచారం కేసు నమోదయ్యిందని, ఆ కేసులో అతడు ఎలాగో బెయిల్ పొందగలిగాడని తెలిపారు. కాగా ప్రస్తుతం అతడి కేసు కు సంబంధించి పోలీస్ సాక్ష్యాధారాలు సేకరించే పనిలో వున్నారు. మహిళలపై ఇంతటి నీచానికి పాల్పడుతున్న బిల్లుకి కఠిన శిక్ష విధించాలని స్థానిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి……