సంఘసేవలో సమంతా!

Wednesday, October 8th, 2014, 04:06:35 PM IST


హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో అనాధ పిల్లల కోసం ‘హెపటైటిస్ బి’ తొలి విడత వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో ప్రముఖ నటి సమంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ హెపటేటిస్ బి జబ్బును అరికట్టడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. అలాగే పిల్లలకు మూడు సార్లు వ్యాక్సిన్ వేయిస్తే జీవితాంతం ఈ ప్రమాదకర వ్యాధికి దూరంగా ఉండవచ్చునని ఆమె వివరించారు. ఇక ఆసుపత్రి యాజమాన్యం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సమంతా ప్రశంసించారు.

అటుపై కాంటినెంటల్ ఆసుపత్రి సిబ్బందితో కలిసి అనాధ బాలలకు హెపటేటిస్ బి వ్యాక్సినేషన్ ఇవ్వడంలో సమంతా పాలుపంచుకున్నారు. కాగా తన ప్రత్యూష స్వచ్చంద సేవా సంస్థ తరపున సమంతా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.