చీపురు పట్టిన సమంతా!

Saturday, November 15th, 2014, 06:27:51 PM IST

samantha-1
టాలివుడ్ అందాల తార సమంత శనివారం స్వచ్చ్ భారత్ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ నగరంలోని ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణాన్ని చీపురుతో శుభ్రం చేశారు. కాగా నటుడు రామ్ చేసిన సవాల్ ను స్వీకరించిన సమంతా నేడు స్వచ్చ్ భారత్ లో పాల్గొని శుభ్రపరిచారు. ఇక సమంతా స్వయంగా చీపురు పట్టుకుని శుభ్రపరచడంతో విద్యార్ధులు, చుట్టుపక్కల వారు కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

అటుపై సమంతా స్వచ్చ్ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అలాగే పారిశుధ్య కార్మికులు రోజూ ఈ పని చేస్తూ ఉంటారని అయితే వారికి దొరికే పారితోషకం మాత్రం నెలకు 5వేలేనని సమంతా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అటుపై ఎవరి చెత్త వారు శుభ్రం చేసుకుంటే మంచిదని ట్విట్టర్ లో సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో తనకి సహకరించిన వారందరికీ సమంతా కృతజ్ఞ్యతలను తెలిపారు.