అమెరికన్ విద్యార్ధి శరత్ హంతకుడి కాల్చివేత!

Monday, July 16th, 2018, 11:28:40 AM IST

ఈనెల 4వ తేదీన అమెరికాలోని కేన్సస్ లో వరంగల్ విద్యార్థి శరత్ కొప్పుల ఒక స్టోర్ లో దారుణంగా కాల్చివేతకు గురైన విషయం తెలియసిందే. అయితే ఒక ఆగంతకుడు అతనిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలిన శరత్ ను వెనువెంటనే హాస్పిటల్ కు తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాగా ఈ ఘటనలో తప్పించుకున్న నిందితుడికోసం కాన్సాస్ పోలీసులు తీవ్రంగా గాలింపులు చేపట్టి, ఎట్టకేలకు అతని జాడను కనుగొన్నారు. కాగా అతన్ని వెతికిపట్టుకున్న పోలీసులు, అతడిని లొంగిపోవాలని వారు చేసిన ఆజ్ఞలను బేఖాతరు చేసిన అతడు, తరువాత వారు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా ప్రతిఘటించి వారిపై తిరగబడి, పిస్టల్ తో కాల్పులు జరగపడం ప్రారంభించాడు.

ఆ కాల్పుల్లో ముగ్గురు పోలీస్ లకు తీవ్ర గాయాలయ్యని, ఆ సమయంలో పోలీస్ లు కూడా అతనిపై ఎదురు కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే మరణించినట్లు వారు చెపుతున్నారు. కాగా అతని మరణ విషయాన్నీ వెల్లడించిన కేన్సస్ పోలీస్ ఆఫిసర్ స్మిత మాట్లాడుతూ, ముందుగా మా డిటెక్టీవ్ లు నిందితుణ్ణి గుర్తించారు, ఆపై అతడిని లొంగిపొమ్మని హెచ్చయించినప్పటికీ, వినకుండా మాపై ఎదురు దాడి చేయడంతో, అతడిని ఎన్కౌంటర్ చేయవలసి వచ్చిందని చెప్పారు. అతడి కాల్పుల్లో గాయపడిన పోలీసులను హాస్పిటల్ కు తరలించామని అన్నారు….