మేక్ ఇన్ ఇండియా సత్య నాదెళ్ళ మద్దతు

Friday, December 26th, 2014, 09:10:28 PM IST


ప్రముఖ సాఫ్టువేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదేళ్ల శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సత్య నాదేళ్ల ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఇది రెండోసారి. ఈ సాయంత్రం మోడీని కలిసే ముందు సత్య నాదెళ్ళ కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ భేటీ అయ్యారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అమెరికా సాఫ్టువేర్ దిగ్గజం మైక్రోసాఫ్టు కూడా భాగస్వామి కావొచ్చుని చెబుతున్నారు. రవిశంకర ప్రసాద్‌తో భేటీ అనంతరం సత్య నాదెళ్ల మాట్లాడారు. ఈ మొబైల్, క్లౌడ్ ప్రపంచంలో ప్రతి భారతీయుడిని భాగస్వామి చేయాలని ఆకాంక్షించారు. అలాగే భారత దేశంలోని ప్రతి వ్యాపార సంస్థ కూడా కొత్తగా వస్తున్న ప్రతి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగతంగా భారత దేశంలో ఉన్న సమయాన్ని తాను అద్భుతంగా భావిస్తానని చెప్పారు. సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది.