అక్కడ ఒకేసారి 47 మందిని ఉరితీశారు..!

Sunday, January 3rd, 2016, 11:48:59 AM IST


తప్పు చేస్తే కఠిన శిక్షలు అమలు చేసే సౌదీ అరేబియా ప్రభుత్వం మరోసారి అలాంటి శిక్షనే అమలు చేసి తీవ్ర సంచలనం రేపింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 47 మందిని శనివారం రోజు ఉరితీసింది. సోదీలో మైనారిటీలుగా ఉన్న షియా ప్రజల హక్కుల కోసం 2011 నుండి పోరాడుతున్న షియా మత గురువు షేక్ – నిమర్ అల్ – నిమర్ కూడా శిక్షింపబడిన వారిలో ఉన్నారు.

దీంతో సౌదీలో ఉన్న షియా ప్రజలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. మరో వైపు అల్ నిమర్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని అందుకే అతన్ని ఉరి తీస్తున్నట్లు సోదీ రాజరికపు ప్రభుత్వం తెలిపింది. ఇరాక్ ప్రభుత్వం అల్ నిమర్ కు సహకరిస్తుందని సోదీ ప్రభుత్వం ఆరోపిస్తుంటే ఇరాక్ మంత్రిత్వ శాఖ ఈ తప్పుకు సౌదీ భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదని హెచ్చరించింది. ఉరితీయబడ్డ వారిలో చాద్, ఈజిప్టు పోరులు ఇద్దరు కాగా మిగిలిన 45 మంది సౌదీ పౌరులే కావటం గమనార్హం.