పాస్ చేయిస్తానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారం!

Saturday, March 17th, 2018, 10:17:08 PM IST

ప్రస్తుతం రోజుల్లో మహిళల రక్షణ కోసం చట్టాలను ఎంత కఠినం చేసినా కూడా కొంత మంది దుర్మార్గులలో మార్పు రావడం లేదు. చదువు సంస్కారం నేర్పాల్సిన వారే అత్యచారాలు జరుపుతుంటే ప్రపంచం ఎంత దారుణంగా మారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. రీసెంట్ ఓ ప్రదానోపాధ్యాయుడు పరీక్ష పేరుతో బాలికపై అత్యచారం జరిపి ఓ కుటుంబంలో శోకాన్ని నింపాడు. హర్యానా సోనిపట్‌ ప్రాంతంలో ఉండే ఓ స్కూల్‌లో ప్రిన్సిపల్ విద్యార్థిని (16) 10వ తరగతి బోర్డు ఎగ్జామ్ లో పాస్ చేయిస్తానని చెప్పి 10 వేల వరకు డబ్బు గుంజాడు.

ఆ అమ్మాయి చేత స్పెషల్ గా పరీక్షా రాయించాలి అని తండ్రిని ప్రిన్సిపాల్ నమ్మించాడు. అంతే కాకుండా బాలికను తాను చెప్పిన చోటుకు తీసుకురమ్మని చెప్పడంతో ఆ మాటలు నమ్మి తండ్రి తీసుకొని వెళ్లాడు. విద్యార్థిని ఇక్కడే ఉండని వేరే అమ్మాయి పరీక్షా రాస్తుందని చెప్పడంతో.. ఆ అమ్మాయి తండ్రి అక్కడ ఇద్దరు మహిళలు ఉండడం చూసి దైర్యంగా వెళ్లిపోయాడు. అనంతరం ఆ ఇద్దరి మహిళల సపోర్ట్ తో ప్రిన్సిపాల్ విద్యార్థిపై అత్యాచారం చేశాడు. సాయంత్రం కూతురిని తీసుకురావడానికి వెళ్లిన తండ్రి అక్కడ పరిస్థితిని చూసి షాక్ అయ్యాడు. వెంటనే తన కూతురిని హాస్పిటల్ లో జాయిన్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ ఇద్దరు మహిళలు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.