షాకింగ్ న్యూస్ : మాజీ ప్రధాని ఇంట్లో వందల కోట్లు సీజ్!

Thursday, June 28th, 2018, 05:42:21 PM IST

ధనమేరా అన్నిటికి మూలం అనే చందాన తయారయింది ప్రస్తుత పరిస్థితి. ధనార్జనకు కింది స్థాయి వ్యక్తి నుండి పై స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరు ఏదో విధంగా అడ్డదారులు తొక్కి అయినా ధనార్జన చేయాలనేదే ద్యేయంగా పెట్టుకున్నట్లు కనపడుతోంది. మన దేశంలో ఇటీవల జరిగిన సోదాల్లో పలు గవేర్నమేంట్ అధికారులు ఇళ్లలో కోట్ల రూపాయల అక్రమార్జనకు ఎసిబి గుర్తించిన ఉదంతాలు చాలానే వున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వాటన్నిటికీ మించింది. ఆయన పేరుకు మాజీ ప్రధాని, కానీ సంపాదన మాత్రం వందల కోట్ల రూపాయలు. ఇక విషయంలోకి వెళితే, ప్రభుత్వరంగ 1-మలేసియా డేవలప్మేంట్ బెర్హాద్ (1ఎండిబి) కుంభకోణం కేసులో ముఖ్య నిందితుడైన మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ ఇంట్లో నిన్న పోలికే అధికారులు కోట్ల రూపాయల సంపద, నగలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిన్న అయన నివసించే అపార్టుమెంట్లపై అనూహ్యంగా తనిఖీలు నిర్వహించిన అక్కడి పోలి అధికారులకు కళ్ళు బయర్లు కమ్మే సంపద కంట పడింది.

అవన్నీ దాదాపు 27.30 కోట్ల డాలర్ల విలువైనవి, అనగా మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1874 కోట్ల విలువైన దాదాపు 35 సంచుల్లో ఉంచిన నగదు, ఆభరణాలు, నగలు, (1,400 నెక్లెస్‌లు, 2,200 రింగులు, 567 హ్యాండ్‌బ్యాగులు, 423 గడియారాలు, 234 జతల కళ్లద్దాలు) బయటపడడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి కాకా మరొక 37 బ్యాగుల్లో అత్యంత ఖరీదైన వస్తువులు, గడియారాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇది మలేషియా దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఆస్తుల స్వాధీన ఘటనగా వాణిజ్య నేరాల విభాగం అధిపతి అమర్ సింగ్ తెలిపారు. కాగా నజీబ్ ప్రధానిగా వున్న సమయంలో, ఆయన సంబంధీకులు చమురు ఒప్పందాల పేరిట వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించి, వాటిని అమెరికా తదితర దేశాలకు తరలించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారనే ఆరోపణలు ఆయనపై వున్నాయి…..