షాకింగ్ న్యూస్ : ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.100 కోట్లు సీజ్!

Tuesday, April 17th, 2018, 04:20:23 PM IST

నేడు కర్ణాటక రాష్ట్రంలో ఏకంగా భారీ మొత్తం లో పట్టుపడడం తీవ్ర సంచలనానికి దారి తీసింది. విషయంలోకి వెళితే, మంగళవారం ఉదయం బెంగళూరు, అనంతపురం రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిక్‌ బల్లాపూర్‌, తిప్పగానిపల్లి వద్ద వెంకటేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బు సుమారు రూ.100 కోట్లపైగానే ఉన్నట్లు సమాచారం.

తాజా ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు, నగదును ఎక్కడికి, ఎందుకు తరలిస్తున్నారన్న విషయంపై దర్యాప్తు చేపట్టారు. త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తుండగా, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా మొత్తానికి మాత్రం ఈ డబ్బును ఓటర్లకు పంచేందుకే తరలిస్తున్నట్లు పోలిలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు…..