షాకింగ్- కత్తి తెమ్మన్నందుకు గొంతు కోశాడు

Monday, January 7th, 2019, 06:00:45 PM IST

ఈ కాలంలో ఎవరికీ ఎందుకు ఎప్పుడు కోపం వస్తుందో కూడా తెలియటం లేదు… పెళ్లి రోజును జరుపుకుందామని ఒక హోటల్ కి వెళ్లిన ఒక మహిళకి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. హోటల్ లో ఉండే వెయిటర్ ని పిలిచి కట్టి తెమ్మని చెప్పిన పాపానికి, అతను ఏకంగా గొంతు కోయబోయాడు. అక్కడ జరిగిన పరిణామాన్ని ఊహించని మహిళ కి తీవ్ర ప్రమాదం తప్పింది. ప్రస్తుతానికి ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

గుజరాత్‌కు చెందిన ఫర్జానా మిరాత్ తమ బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్లేందుకు దక్షిణాఫ్రికా నుంచి బయల్దేరారు. మధ్యలో మంబైలో దిగి.. అంధేరిలోని ఓ హోటల్‌కు వెళ్లారు. ఫర్జానా దంపతుల పెళ్లి రోజు కావడంతో కేక్ కట్ చేద్దామని, ఓ కేక్ ఆర్డర్ ఇవ్వగా, వెయిటర్ తీసుకొచ్చాడు కానీ కత్తి మర్చిపోయాడు. అయితే కత్తి తెమ్మని వెయిటర్‌ కి మల్లి చెప్పడంతో కోపోద్రిక్తుడైన వెయిటర్ ఆమె గొంతు కోయబోయాడు. పక్కనే ఉన్న ఆమె తల్లి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.