లేడి కానిస్టేబుల్ పై అత్యాచారం చేసిన ఎస్ఐ…

Sunday, November 18th, 2018, 05:54:36 PM IST

స్టేషన్ లో ఉన్న మహిళా కానిస్టేబులే పై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీసి ఆమెని బెదిరిస్తూ మరో పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఎస్ఐ గా పని చేస్తున్న అమిత్ శెలర్ అదే స్టేషన్ లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ పై కన్నేశాడు. గత సంవత్సరం మార్చ్ లో ఆమె కి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత అమిత్ ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ పనిని ఫోనులో రికార్డు చేసుకొని, ఆమెని పలుమార్లు బెదిరించి మరి లొంగదీసుకున్నాడు. ఒప్పుకోకపోతే చాలా సార్లు కొట్టాడు కూడా.

ఈ వీడియో అంతర్జాలంలో, సామాజిక మాంద్యమాల్లో పెడతానని బెదిరించడం తో పాటు, అనేక ప్రాంతాల్లోకి రమ్మని చెప్పి అక్కడ కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఆ రాక్షసుడి వేధింపులకి తట్టుకోలేక ఆ బాధితురాలు ఉన్నతాధికారులని ఆశ్రయించింది. దీనితో అతనికి ఎస్సీ, ఎస్టీ వేధింపులతో పాటు అత్యాచార కేసు నమోదు చేసారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడతామని తనకి సంబందించిన వారు తెలిపారు.