800మంది పిల్లల పుట్టుకకు ఇతగాడే కారణమట..!

Friday, January 15th, 2016, 02:37:31 PM IST

అతనికి ప్రపంచం నలుమూలలా పిల్లలున్నారు. వాళ్ళ సంఖ్య దాదాపు 800 పైమాటే. ఏంటి ఒకరికి 800 మంది పిల్లలేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం బ్రిటన్ కు చెందిన సైమన్ వాట్సన్ కు నిజంగానే 800మంది పిల్లలున్నారు. ఎందుకంటే అతనొక వీర్యదాత కనుక. వాట్సన్ గత 16 సంవత్సరాలుగా తన వీర్యాన్ని దానం చేస్తూ ఎంతోమంది ఆడవాళ్ళకు పిల్లల్ని అందించాడు. మొదట్లో వాట్సన్ అప్పుడప్పుడు వీర్యాన్ని దానం చేస్తూ వచ్చినా తన భార్యతో విడాకులు తీసుకున్నప్పటి నుండి రెగ్యులర్ గా ఆ పని చేస్తూ వచ్చాడు.

వాట్సన్ ఒకసారి వీర్యాన్ని దానం చేస్తే అందుకు బదులుగా 100 డాలర్లు తీసుకుంటూ దాన్నే బిజినెస్ గా మార్చుకున్నాడు. మొదట తన గురించి ప్రపంచానికి తెలపడానికి వాట్సన్ సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవాడు. తన క్లైంట్లకి తన ఆరోగ్యం గురించి తెలియడానికి ప్రతి 3 నెలలకొకసారి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకుని ఆ రిపోర్టులను ఫేస్ బుక్ లో పెడుతుంటాడు వాట్సన్. ప్రస్తుతం వాట్సన్ కు 41 ఏళ్ళు. ఇప్పుడప్పుడే తనకు వీర్య దానాన్ని ఆపే ఆలోచన లేదని. ఇంకా చాలా కాలం ఇదే పనిని చేస్తుంటానని అతను అంటున్నాడు.