ఆస్తికోసం అమ్మనే కడతేర్చాడు!

Thursday, May 3rd, 2018, 09:44:18 AM IST

తృచ్ఛమైన డబ్బుకోసం కన్నతల్లి అని కూడా చూడకుండా అత్యంత కర్కశంగా చంపేశాడు ఒక కసాయి. వివరాల్లోకి వెళితే, అనంతపురం జిల్లా గుంతకల్ కి చెందిన భాగ్యమ్మ, రామాంజనేయులు కు ముగ్గురు అబ్బాయిల కిరణ్, సురేష్, విజయ్. అలాగే ఒక కూతురు వున్నారు. రైల్వేలో ఉద్యోగిగా పనిచేసిన రామాంజనేయులు 20 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా తండ్రి మరణాంతరం తల్లిని జాగ్రత్తగా చూసుకోవలసిన ఆ బిడ్డలు ఆస్తి కోసం అక్కడినుండి తల్లిని హిమ్సహించ సాగరు.

ఆయన చనిపోయి 20 రోజులయినా కాలేదు అప్పుడే ఆస్తుల గొడవెందుకు, కొద్దిరోజులు ఆగి మాట్లాడుకుందాం అని తల్లి చెప్పినప్పటికీ ఆ కొడుకులు వినిపించుకోకుండా రోజు భాగ్యమ్మపై కి గొడవకి దిగేవారు. వారి బాధ భరించలేని ఆమె హైదరాబాద్ లోని సోదరి వీరమ్మ వద్దకు వచ్చేసింది. అయితే ఆమె ఉంటున్న అడ్రస్ ను ఎలాగో తెలుసుకుని వచ్చిన మూడవ కుమారుడు విజయ్ వీరమ్మ బయటకు పనికి వెళ్లిన సమయం చూసి ఇంట్లో తన తల్లి భగ్యమ్మ వద్దకు వచ్చి గొడవకు దిగాడు.

అయితే ఆ సమయంలో వీరమ్మ కోడలు చిట్టెమ్మ ఆరుబయట బట్టలు ఉతుకుతుండడంతో లోపల గొడవ శబ్దాన్ని విని చిట్టెమ్మలోపలికి రాబోగా, అడ్డగించిన విజయ్ తలుపులు మూసాడు. అప్పటికే చుట్టుప్రక్కల వారిని పిలిచినా చిట్టెమ్మ మిగతావారితో కలిసి తలుపులు తెరవడానికి ఎంతో ప్రయత్నించింది. ఇంకా బయటివారు లోపలి వస్తారని భావించిన విజయ్ తల్లి తలపై రోకలిబండతో గట్టిగా కొట్టి, నా తల్లిని నేనే చంపాను, ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ తలుపులు తీసి పారిపోయే ప్రయత్నం చేసాడు. ఆ సమయంలో అందరూ కలిసి అతన్ని పట్టుకోబోగా, విదిలించుకుని తప్పించుకున్నాడు. అక్కిఆదివారు వెంటనే పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో, ఆస్తి తగాదాల వల్ల హత్య జరిగినట్లు నిర్ధారించుకుని, నిందితుడు విజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ సంఘటన ఆ ప్రాంత వాసుల్లో సంచలనంగా మారింది……